: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుక ఏర్పాట్లలో అపశ్రుతి


నల్గొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుక ఏర్పాట్లలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫ్లెక్సీ కడుతుండగా రవి అనే ఓ యువకుడికి కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స కోసం అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అతని పరిస్థితి విషమంగా ఉందని చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వీరేశం ఆసుపత్రి వద్దకు బయల్దేరారు.

  • Loading...

More Telugu News