: బెల్జియం ప్రధాని వినికిడి శక్తిని పోగొట్టిన రాణి!


ఇదొక విచిత్ర సంఘటన. బెల్జియం రాకుమారి ఆస్ట్రిడ్‌ చేసిన ఓ ఘన కార్యం వల్ల ఆ దేశ ప్రధాని వినికిడి శక్తిని కోల్పోయారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... బెల్జియంలోని ఓ స్టేడియంలో రన్నింగ్ రేస్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆ దేశ ప్రధాని చార్ల్స్‌ మైఖెల్‌, రాకుమారి ఆస్ట్రిడ్ హాజరయ్యారు. రన్నింగ్ రేస్ ను ప్రారంభిస్తూ, అందుకు సంకేతంగా ఆస్ట్రిడ్ తుపాకీని గాల్లోకి కాల్చారు. దీంతో ఆ శబ్దానికి పక్కనే కూర్చున్న ప్రధాని గారి చెవులు పనిచేయడం మానేశాయి. అప్పటికే ఆయన టిన్నిటస్ అనే చెవి వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి తోడు తుపాకీ నుంచి ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడడంతో ఆయన ఎడమచెవి వినికిడి శక్తిని కోల్పోయింది. దీంతో వైద్యుడ్ని సంప్రదించగా, ఆ చెవి తాత్కాలికంగా వినికిడి శక్తిని కోల్పోయిందని చెప్పారు. దీంతో ఆయన పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు.

  • Loading...

More Telugu News