: కాబూల్ లో దాడి చేసింది మేమే!: ఇస్లామిక్ స్టేట్ ప్రకటన


అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యానికి స‌మీపంలో దుండగులు బాంబు దాడికి పాల్ప‌డి 80 మంది ప్రాణాలు తీసిన విష‌యం తెలిసిందే. ఈ దాడి తామే చేశామ‌ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకట‌న చేసింది. ఈ పేలుడుతో అక్క‌డి ప్రాంతంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన అక్క‌డి భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే ఎంబసీ ఉద్యోగులను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఈ పేలుడు ధాటికి భారత రాయబార కార్యాలయ అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. భార‌త సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని భార‌త విదేశాంగ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న చేసింది. అఫ్ఘనిస్థాన్‌కు వీలైనంత సాయం చేస్తామ‌ని భార‌త్ తెలిపింది.         

  • Loading...

More Telugu News