: ‘సో సో ల‌వ్లీ’.. జూనియర్ నానితో హీరో నాని ఫొటో చూసి మురిసిపోయిన సమంత


సహజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని ఇటీవలే తన బుల్లి కుమారుడు అర్జున్‌తో క‌లిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న కుమారుడిని ప్రేమ‌గా త‌న గుండెల‌పై ప‌డుకోబెట్టుకుని, ముద్దాడుతూ హీరో నాని పోస్ట్ చేసిన ఆ ఫొటో నాని అభిమానుల‌తో పాటు చెన్నై బ్యూటీ స‌మంత‌ను కూడా విశేషంగా ఆక‌ట్టుకుంది. 'సో సో లవ్లీ' అని పేర్కొంటూ నానికి స‌మంత శుభాకాంక్ష‌లు తెలిపి, నాని పోస్ట్ ను షేర్ చేసింది. ‘అందరికీ హాయ్‌ చెప్పు అర్జున్‌’ అని నాని ఆ ఫొటోలో పేర్కొంటూ ఈ విధంగా తన కుమారుడి పేరు అర్జున్ అని తెలియజేసిన విష‌యం తెలిసిందే.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Say Hi to everyone Arjun :)<a href="https://twitter.com/hashtag/Nani2point0?src=hash">#Nani2point0</a> <a href="https://t.co/dJZfio5890">pic.twitter.com/dJZfio5890</a></p>— Nani (@NameisNani) <a href="https://twitter.com/NameisNani/status/869517192047362049">May 30, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

  • Loading...

More Telugu News