: కొడుకు చనిపోయాడని.. కోడలిని వ్యాపారికి అమ్మేసిన అత్తమామలు!
ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కిష్టాపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. కొడుకు చనిపోయాడని తమ కోడలు లలితను అత్తమామలు రూ.1.80 లక్షలకు ఓ గుజరాత్ వ్యాపారికి అమ్మేశారు. అక్కడి నుంచి లలిత తన సోదరుడికి ఫోను చేసి ఆ వ్యాపారి తనను వేధిస్తున్నాడని చెప్పింది. దీంతో లలిత తల్లిదండ్రులు, సోదరుడు ఈ రోజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లలితకు ఓ పాప ఉంది. ఆ పాప అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. ఆ పాపతో పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన లలిత కుటుంబ సభ్యులు తమ కూతురి ఆచూకీ తెలపాలని కోరారు. తమ కూతురు ఎవరో వ్యాపారి చేతిలో వేధింపులకు గురవుతోందని, ఆమెను కాపాడాలని వేడుకున్నారు.