: ఆఫీస్ బాత్‌రూంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి.. నగ్నంగా కనిపించిన వైనం
చెన్నై మహీంద్ర వరల్డ్ సిటీలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. బాత్ రూంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇళయ రాజా(30) నగ్నంగా పడి ఉండడాన్ని చూసిన ఓ స్లీపర్ ఆ విషయాన్ని తమ కార్యాలయ సిబ్బందికి తెలిపాడు. దీంతో వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఇళయ రాజాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడని వైద్యులు చెప్పారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. ఇళయ రాజా మృతదేహంపై ఎటువంటి గాయాలూ లేవని పోలీసులు చెప్పారు.