: కులపిచ్చి అభిమానికి దీటైన జవాబిచ్చిన నాచురల్ స్టార్ నాని!


సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో ఎవరు, ఎవరితోనైనా, ఎలాగైనా మాట్లాడే వెసులుబాటు కలిగింది. ఈ నేపథ్యంలో సినీ నటులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నానిపై ఓ అభిమాని అసంబద్ధమైన ఆరోపణలు చేశాడు. అతనికి నాని దీటైన సమాధానం చెప్పాడు. ఈ మధ్య జరిగిన మహానటుడు ఎన్టీయార్‌ జన్మదినం సందర్భంగా నాని తన ట్విట్టర్ పేజ్ లో ‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చు’ అని ట్వీట్‌ చేశారు.

దీనిపై ఒక అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తూ...నాని అలా ట్వీట్‌ చేయడానికి కులాభిమానమే కారణమని ఆరోపించాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన నాని... అతనికి సమాధానమిస్తూ...‘నేనూ మీలాగే తెలుగువాణ్ని. ఎన్టీయార్‌ నే కాదు చిరంజీవిని కూడా బాగా అభిమానిస్తాను. అయితే నేను పెద్దలను గౌరవించే సంస్కారం ఉన్నవాణ్ని. అందుకే ఇతర అంశాలను పట్టించుకోను' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి కంగుతిన్నాడు. దీంతో దెబ్బకు ఆ ట్వీట్ డిలీట్ చేసేశాడు. 

  • Loading...

More Telugu News