: దాసరి మృతిపై స్పందించిన సోనియా గాంధీ
దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. ప్రజాసేవ పట్ల ఆయనెంతో నిబద్ధతతో ఉండేవారని అన్నారు. కేంద్ర మంత్రిగా వివిధ చర్చల్లో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చేవారని తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఆయన చేసిన సేవలను పార్టీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, దాసరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.