: దాసరి నాకు మంచి మిత్రుడు.. చాలా సార్లు కలుసుకునే వాళ్లం!: కొణిజేటి రోశయ్య


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సినీ ప్రముఖుడే కాకుండా వ్యక్తిగతంగా తనకు స్నేహితుడని ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. దాసరి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన రోశయ్య మాట్లాడుతూ, తామిద్దరం చాలా సార్లు కలుసుకుని, మాట్లాడుకునేవారమని అన్నారు. ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా తాము మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. దాసరి కేవలం సినీ పరిశ్రమలో తనదైన పాత్రను రూపొందించుకోవడమే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనదైన పాత్రను రాసుకున్నారని ఆయన చెప్పారు. ఏ పని చేసిన వందశాతం నిబద్ధతతో చేయడం దాసరి గొప్పతనమని ఆయన చెప్పారు. మిత్రుడ్ని కోల్పోవడం బాధగా ఉందని ఆయన తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News