: దాసరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం: హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దాసరి ఆరోగ్యంపై కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దాసరి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ఆయనకు హిమో డయాలసిస్ అందిస్తున్నామని తెలిపారు. దాసరి ప్రధాన అవయవాల పనితీరుని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. అన్నవాహిక దెబ్బతినడంతో గొంతు నుంచి జీర్ణాశయం వరకు చికిత్స అందించామని తెలిపారు.