: తీవ్ర అస్వస్థతకు గురైన దర్శకుడు దాస‌రి నారాయ‌ణ రావు.. కిమ్స్ ఆసుప‌త్రిలో దర్శకరత్న


ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరారు. గ‌డిచిన ఐదు నెల‌ల్లో దాస‌రి నారాయ‌ణ రావు ఇప్ప‌టికే 2, 3 సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌ల ఆయన త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల స‌మ‌యంలో కూడా ఉత్సాహంగానే క‌నిపించారు. అయితే, దాసరి మ‌ళ్లీ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న‌కు ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలిసింది.

ఈ ఏడాది మార్చి 29న దాసరిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ఇప్ప‌టికే వైద్యులు ప‌లు స‌ర్జరీలు చేశారు. ఆయ‌న‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఆసుప‌త్రిలో ఎప్పుడు చేరార‌నే విష‌యం తెలియాల్సి ఉంది. ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్నార‌న్న విష‌యం ఈ రోజే మీడియాకు తెలిసింది. ఈ రోజు సాయంత్రం దాస‌రి ఆరోగ్యంపై బులిటెన్ విడుద‌ల చేయ‌నున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News