: బెన్ స్టోక్స్ కు ఐపీఎల్ చాలా ఉపయోగపడింది: ఇయాన్ బోధమ్
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ఐపీఎల్ ఎంతో ఉపయోగపడిందని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ భోధమ్ తెలిపాడు. బెన్ స్టోక్స్ ఆటతీరుపై బోధమ్ మాట్లాడుతూ, ఐపీఎల్ లో వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో ఆడడం వల్ల బెన్ స్టోక్స్ వ్యక్తిగా, క్రికెటర్ గా ఎంతో పరిణతి సాధించాడని అన్నాడు. స్టోక్స్ లో వచ్చిన ఈ పరిణతికి కారణం తనను అడిగితే ఐపీఎల్ అని కచ్చితంగా చెబుతానని చెప్పాడు.
ఇండియా నుంచి ఇంగ్లండ్ కు స్టోక్స్ మెరుగైన క్రికెటర్ గా వెనక్కి వచ్చాడని తెలిపాడు. 'ఇప్పుడతనిలో గతంలో ఉన్న గందరగోళం లేదు. ఎప్పుడు ఏం చేయాలో అతనికి బాగా తెలుసు... ఇప్పుడు పూర్తి స్పష్టతతో ఆడుతున్నాడు' అని ఇయాన్ బోధమ్ తెలిపాడు. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో బెన్ స్టోక్స్ (101) సెంచరీతో రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో బోధమ్ ప్రశంసలు కురిపించాడు.