: విశాఖ రావాలంటే భయపడుతున్నా!: లోకేష్
తనకు విశాఖ తెగ నచ్చేస్తోందని, ఇక్కడికి వస్తే వెళ్లబుద్ధి కావడంలేదని, దీంతో తనకు విశాఖ రావాలంటనే భయం వేస్తోందని ఏపీ ఐటీ, పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేష్ చమత్కరించారు. మహానాడు ముగింపు వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన, విశాఖ సముద్రం తననెంతో ఆకర్షిస్తోందని అన్నారు. నగరాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చి చూపించే బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నానని, రెండేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. రాయలసీమను మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల వ్యవధిలో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి దగ్గరైందని అన్నారు.