: గూగుల్ ప్లే స్టోర్ లో ఫ్రీ మ్యూజిక్... నాలుగు నెలలు బంపర్ ఆఫర్!


ప్రముఖ అంతర్జాల (ఇంటర్నెట్) సెర్చింజన్‌ సంస్థ గూగుల్‌ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన ‘గూగుల్‌ ప్లే మ్యూజిక్‌’ లో కొత్తగా చేరే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. కొత్తగా గూగుల్ ప్లే స్టోర్ లో చేరే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నాలుగు నెలలపాటు ఉచితంగా పాటలు విని ఆనందించే అవకాశం కల్పించామని చెప్పింది. ఈ ఆఫర్ తో గూగుల్ ప్లే మ్యూజిక్ లైబ్రరీలోని 50,000 పాటలు వినే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది. తొలుత ఈ ఆఫర్ ను మూడు నెలలపాటు మాత్రమే ప్రకటించినట్టు తెలిపిన గూగుల్ సంస్థ, తాజాగా మరో నెల అదనంగా పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ ను కేవలం స్మార్ట్ ఫోన్ యూజర్లు మాత్రమే కాకుండా, గూగుల్ ప్లే మ్యూజిక్ సాయంతో కంప్యూటర్, మొబైల్ లో ఎఫ్ఎం రేడియోను కూడా ఆస్వాదించవచ్చని గూగుల్ ప్రకటించింది. 

  • Loading...

More Telugu News