: ఐసిస్ మద్దతుదారుడిని ఫోన్లో వివాహం చేసుకున్న వైద్య విద్యార్థిని.. తనకు వివాహమైందన్నా వినిపించుకోని యువతి!


ఉత్తరప్రదేశ్‌లోని అజాంగఢ్‌కు చెందిన వైద్య విద్యార్థిని ఒకరు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఉగ్రవాద సంస్థ ఐసిస్ మద్దతుదారుడిని ఫోన్‌లో వివాహం చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అతడిని ఈనెల మొదట్లో ఫోన్‌లో నిఖా చేసుకుంది. ప్రస్తుతం అతడు ఇంటెలిజెన్స్ అధికారుల అదుపులో ఉన్నాడు. రాజస్థాన్‌లోని చురు ప్రాంతానికి చెందిన ఐసిస్ అనుమానిత ఉగ్రవాది అయిన అంజాద్ ఖాన్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే పనిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ అతడి గురువని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అంజాద్‌ఖాన్‌తో సదరు యువతి ఇస్లాం భావజాలంపై సుదీర్ఘంగా చాట్ చేసేదని పోలీసులు తెలిపారు. తనకు వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పినా యువతి అతడిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడిందని వివరించారు. ఈ నెల మొదట్లో ఫోన్‌లో వీరి వివాహం జరిగిందని, ఆమెపై ఓ కన్నేసి ఉంచామని, సరైన సమయంలో ఆమెను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News