: మరో యుద్ధానికి సిద్ధమవుతున్న జియో.. దీపావళికి 'జియో ఫైబర్' ప్రారంభం.. చవగ్గా అందనున్న సేవలు!


మరో యుద్ధానికి రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. దీపావళి నుంచి హోం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొబైల్ సర్వీసుల మాదిరిగానే జియో ఫైబర్ ద్వారా మరోసారి ధరల యుద్ధానికి తెరతీయనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కేవలం రూ.500కే 100 జీబీని ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇతర టెల్కోలు జియో ఆఫర్ చేస్తున్న ధరకు రెట్టింపు వసూలు చేస్తుండగా అందులో సగం డేటాను ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల మంది వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌వే సగం వరకు కనెక్షన్లు ఉన్నాయి. కాగా, జియో ఫైబర్ 100 ఎంబీపీఎస్ వేగంతో సేవలు అందించనున్నట్టు తెలుస్తోంది. తొలుత దేశంలోని 10 పెద్ద నగరాల్లో జియో ఫైబర్‌ను ప్రారంభించనుంది. అనంతరం దేశమంతా ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News