: అరుణాచల్‌ప్రదేశ్‌ విషయంలో.. భారత్‌ను హెచ్చ‌రించిన చైనా!


భారత్‌పై చైనా మరోసారి తన తీరుని కనబర్చింది. భారత్‌లోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను చైనా త‌మ భూభాగంగా చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు భార‌త్ అసోంను, అరుణాచల్‌ప్రదేశ్‌ను అనుసంధానం చేస్తూ అతి పొడవైన బ్రిడ్జిని ప్రారంభించింది. తొమ్మిది కిలోమీటర్లకుపైగా నిర్మించిన ఈ భారీ వంతెనకు ‘ధోలా-శాండియా’ అని పేరు పెట్టింది. అయితే, ఈ విష‌యంపై స్పందించిన చైనా... త‌మ‌కు, భార‌త్‌కు మ‌ధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ విష‌యంపై స్పష్టత వచ్చే వ‌ర‌కు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎలాంటి మౌలికరంగ నిర్మాణం జరప‌కూడ‌ద‌ని హెచ్చరించింది. ఒక‌వేళ ఇప్పటికే ప‌నులు ప్రారంభ‌మై ఉంటే వాటిని ఆపేయాలని చెప్పింది. తాము చేసే హెచ్చరికను భారత్‌ పరిగణనలోకి తీసుకోవాల‌ని సూచించింది.           

  • Loading...

More Telugu News