: న్యూజిలాండ్ పై గెలుపు తర్వాత.. టీమిండియా ఆటగాళ్ల డిన్నర్ పార్టీ!
వచ్చే గురువారం నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇంగ్లండ్ కు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అంతా కలిసి నిన్న రాత్రి ఓ హోటల్‌లో భోజనం చేశారు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం హోటల్‌కు వెళ్లిన ఆటగాళ్లు విందులో పాల్గొని ఫొటోలు దిగారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోలను పోస్ట్ చేశాడు. నిన్న రాత్రి న్యూజిలాండ్‌తో విజయం అనంతరం ఆటగాళ్లతో కలిసి విందులో ఇలా పాల్గొన్నానని కోహ్లీ పేర్కొన్నాడు. మరికొందరు టీమిండియా ఆటగాళ్లు కూడా తమ ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను పోస్ట్ చేసి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
One from last night, meal with the boys after a good day at work!