: విదేశీ పర్యటనలో భాగంగా... జర్మనీలో అడుగుపెట్టిన మోదీ!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా కొద్ది సేపటి క్రితం జర్మనీలోని బెర్లిన్‌లో అడుగుపెట్టారు. ఆయనకు బెర్లిన్ విమానాశ్రయంలో ఆ దేశ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కాసేపట్లో మోదీ.. జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్‌తో భేటీ అవుతారు. ఈ రోజు నుంచి వచ్చేనెల 3 వరకు ఆయన నాలుగు దేశాల్లో పర్యటిస్తారు. జర్మనీ పర్యటన అనంతరం మోదీ.. స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్‌లలో పర్యటిస్తారు. ఆయా దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక సత్సంబంధాల బలోపేతంపై మోదీ చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది.