: కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్
కార్యకర్తల అభీష్టం మేరకు తాను టీడీపీ నుండి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఇటీవలే ప్రకటించిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఈ రోజు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తన మద్దతుదారులతో తరలివచ్చిన ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్పిన కేసీఆర్.. అనంతరం మాట్లాడుతూ.. చరిత్రలో ఎప్పుడు ఎవ్వరూ చేయలేనన్ని సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీ మీద రంగులు, ముడిసరుకులు సరఫరా చేయనున్నామని తెలిపారు. అంగన్ వాడీ వర్కర్ల జీతాలు పెంచామని చెప్పారు. గొల్ల, కురమ వర్గాలను ఆదుకుంటున్నామని తెలిపారు.