: అమితాబ్ చంకన ఆరాధ్య... మురిసిపోయిన‌ ‘బిగ్ బీ’ అభిమానులు!


బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రతి ఆదివారం తన ఫ్యాన్స్‌ను క‌లిసి హుషారుగా ఫొటోల‌కి పోజులిస్తారు. ఎప్పటిలాగే నిన్న ఆయ‌న త‌న అభిమానుల ముందుకు వ‌చ్చారు. కానీ, మామూలుగా కాదు.. ఇంత‌వ‌ర‌కూ త‌నతో పాటు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాని త‌న కుటుంబంలోని ఓ వ్య‌క్తిని ఆయ‌న తీసుకొచ్చారు. ఆమే.. అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌ల కూతురు ఆరాధ్య‌. ఆరాధ్యతో క‌లిసి తన నివాసం ‘జల్సా’ వద్ద అమితాబ్ బ‌చ్చ‌న్‌ అభిమానులకు అభివాదం చేశారు. అయితే, ఆ సమయంలో భారీగా చేరుకున్న అభిమానులను చూసి త‌న మ‌న‌వ‌రాలు ఆరాధ్య కాస్త భయపడిపోయింద‌ని అమితాబ్ ట్వీట్ చేశారు. ఐశ్వర్య, ఆరాధ్య‌ల‌తో క‌లిసి తాను దిగిన ఫొటోల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.                                                                                      

  • Loading...

More Telugu News