: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. షూ విసిరిన యువకుడు
కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయకు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని ఆయన సొంత జిల్లాలో పటీదార్ ఉద్యమ కార్యకర్త ఒకరు ఆయనపై షూ విసిరాడు. భావనగర్ జిల్లా వల్లభిపూర్ మున్సిపాలిటీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించేందుకు నిలబడగానే భవేశ్ పటేల్ అనే యువకుడు ఆయనపై షూ విసిరాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మీడియాతో కూడా సరిగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి భావనగర్ రీజియన్ కు భవేశ్ పటేల్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నాడు. కేంద్ర మంత్రి యువకుల కోసం ఏమీ చేయడం లేదని... దీనికి నిరసనగానే తాను ఈ పని చేశానని భవేశ్ తెలిపాడు.