: రామ్మోహన్ నాయుడిపై చంద్రబాబు ప్రశంసలు... అఖిలప్రియ తన నమ్మకం నిలబెడుతోందంటూ కితాబు!
యువకుడైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రజల నేతగా ఎదిగాడని, సమస్యల కృషికి ఎంతో కృషి చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను మోస్తున్నాడంటూ మెచ్చుకున్నారు. తన నియోజకవర్గంలో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుంటున్నాడని అన్నారు. ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరని లోటని... ఎర్రన్నాయుడు తనకు ఆత్మీయుడని చెప్పారు. యువతలోని శక్తిని గుర్తించి, వారికి తగు ప్రాధాన్యత ఇవ్వడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. భూమా నాగిరెడ్డి చనిపోవడంతో ఆయన కుమార్తె అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చామని... ఆమె కూడా సమర్థవంతంగా పని చేస్తూ, తన నమ్మకాన్ని నిలబెట్టిందని కితాబిచ్చారు.