: రజనీకాంత్ పార్టీ పనులు ప్రారంభం.. బెంగళూరులోని ఓ ఏజెన్సీ సేవలు తీసుకుంటున్న తలైవా
దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు. ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సన్నాహకాలు కూడా ప్రారంభమయ్యాయి. పార్టీని ఎలా నిర్మించాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే దానిపై కసరత్తు మొదలైంది. దీనికోసం బెంగళూరులోని ఓ ఏజెన్సీ సేవలను రజనీ తీసుకుంటున్నారు. తమిళ ఓటర్ల నాడిని అధ్యయనం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి కావాల్సిన అజెండాను రూపొందించడం తదితర కార్యాలను ఈ ఏజెన్సీ చేస్తుంది. మరోవైపు, ఇతర పార్టీల్లో ఉన్న ప్రముఖ నేతలను ఆకర్షించడంపై రజనీ, ఆయన సలహాదారులు దృష్టిని సారించారు. ఇప్పటికే వీరి దృష్టిలో పలువురు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పలువురు నేతలు రజనీ పార్టీలోకి చేరేందుకు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నారని సమాచారం.