: త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ భారీ చిత్రం: టీఎస్ఆర్ సంచలన ప్రకటన
మెగా అభిమానులకు ఓ అద్భుతమైన శుభవార్తను అందించారు కాంగ్రెస్ నేత టీ సుబ్బరామిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలసి నటించే చిత్రానికి తాను నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన, ఇందుకు సంబంధించిన కథ సిద్ధమైందని, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇది రూపొందుతుందని ఆయన తెలిపారు. చిత్రం ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తానని ఆయన అన్నారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.