: పసలేని ప్రసంగాలతో బోర్ కొట్టిస్తే ఎలా?: గద్దె బాబూరావు ప్రసంగాన్ని ఆపించిన చంద్రబాబు
వినేవారిని ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడం నేతలు నేర్చుకోవాలని, ఆ తరువాతనే వేదిక ఎక్కాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. పసలేని ప్రసంగాలతో కార్యకర్తలకు బోర్ కొట్టిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ఘటన విశాఖపట్నంలోని మహానాడులో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు సుదీర్ఘంగా మాట్లాడుతున్న వేళ జరిగింది. ఆయన మాట్లాడుతున్న అంశాలు పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో, చంద్రబాబు కల్పించుకున్నారు. వేలాది మంది కూర్చున్న సభలో ఇలా మాట్లాడటం ఏంటని ఆయన బాబూరావును ప్రశ్నించారు. అందరికీ నచ్చేలా మాట్లాడటం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ వెంటనే మహానాడు నిర్వాహకులు గద్దె బాబూరావు నుంచి మైక్ తీసుకుని వేరొకరిని ప్రసంగించేందుకు పిలవడం గమనార్హం.