: అమెజాన్ అడవుల్లో గాజుకప్ప.. గుండె ఆకారం కూడా పైకి కనిపిస్తోంది!


ఈక్వెడార్ లోని అమెజాన్ అడవుల్లో సరికొత్త కప్పను పరిశోధకులు గుర్తించారు. ఉభయచరాలపై పలు పరిశోధనలు చేస్తున్న శాన్ ఫ్రాన్సిస్కో డీ క్వీటో యూనివర్సిటీ పరిశోధకులు జువాన్ గ్యుయాసమిన్ టీమ్ కు గాజులాంటి పారదర్శక చర్మం కలిగిన కొత్త జాతి కప్పలు కనిపించాయి. ఈ కప్ప గుండె సహా, లోపలి అవయవాలన్నీ స్పష్టంగా బయటకు కనిపించడం విశేషం. ‘హ్యాలినో బ్యాట్రాషియం యాకు’ గా పిలుస్తున్న ఈ ఉభయచర జీవిపై మరిన్ని పరిశోధనలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.

వీపుపై పచ్చటి చుక్కలున్న ఈ జీవులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని, దీంతో వీటిపై పరిశోధించి, వీటి సంతానోత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న జువాన్‌ గ్యుయాసమిన్‌ తెలిపారు. అయితే వీటి స్పందనల తీరు విభిన్నంగా ఉందని, ఇలాంటి కప్పలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పరిశోధిస్తున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News