: మహానాడుకు రాలేకపోయినందుకు వివరణ ఇచ్చుకున్న బాలకృష్ణ, రాయపాటి
విశాఖపట్నంలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకు తాము రాలేకపోయినందుకు టీడీపీ నేతలు బాలకృష్ణ, రాయపాటి సాంబశివరావులు వివరణ ఇచ్చుకున్నారు. తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నందున మహానాడుకు రాలేకపోయానని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అన్నారు. పలు లొకేషన్‌లలో సినిమా షూటింగ్ చేయాల్సి వుందని, అందుకు తేదీలు ముందుగానే ఖరారయ్యాయని తెలిపారు. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ పంపారు. తాను అనారోగ్యం కారణంగానే రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు.