: ఢిల్లీ వర్సిటీలో మరో కలకలం... గోడలపై ఇస్లామిక్ స్టేట్ అనుకూల నినాదాలు
ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఢిల్లీ యూనివర్సిటీలో మరో కలకలం చెలరేగుతోంది. ఆ వర్సిటీ గోడలపై ఇస్లామిక్ స్టేట్ అనుకూల నినాదాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో వీటిని గమనించిన పలువురు విద్యార్థులు.. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ అంకిత్ సాంగ్వాన్‌కు విషయాన్ని తెలిపారు. అనంతరం ఈ విషయంపై వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ వర్సిటీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సాంగ్వాన్ అన్నారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.