: విద్యార్థినికి ‘కాబోయే ఉగ్రవాది’ అవార్డు ఇచ్చిన టీచర్!
ఓ విద్యార్థినికి ‘కాబోయే ఉగ్రవాది’ పేరిట ఓ టీచర్ అవార్డు ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్న ఘటన అమెరికాలోని హూస్టన్‌లోని ఆంథోనీ ఆగిర్ హై అనే స్కూల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై చానెల్వ్యూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే, ప్రతి ఏటా ఆ స్కూల్లో సరదాగా పలు అవార్డులు ఇస్తారు. ఈ సందర్భంగా ఏకంగా టెర్రరిస్ట్ అనే పేరుతో ఏడవ తరగతి విద్యార్థిని లిజెత్ విలానుయెవాకు ఈ అవార్డు ఇచ్చారు. కాబోయే టెర్రరిస్ట్ అని తనకు అవార్డు ఇచ్చిన నేపథ్యంలో ఆ అమ్మాయి షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆ అవార్డు ఇచ్చిన టీచర్‌పై మండిపడుతున్నారు.