: ప్రాణాలు పోయేంతవరకూ జగన్ వెంటే: వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని వైకాపా నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, తన ప్రాణం పోయేంత వరకూ వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. జగన్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని వ్యాఖ్యానించిన ప్రసాద్ రెడ్డి, తనపై బురదజల్లే ప్రయత్నాల్లో భాగంగానే, తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ వార్తలపై స్పందించాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారనే వాటిని ఖండించాల్సి వచ్చిందని అన్నారు.