: మహానాడుకు దూరంగా ఉన్న నందమూరి కుటుంబం.. షూటింగులో బాలయ్య!


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖలో వైభవంగా జరుగుతున్న వేళ, నందమూరి కుటుంబ సభ్యులెవరూ పాల్గొనకపోవడంపై కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితాలో హరికృష్ణ పేరు ఉన్నప్పటికీ, ఆయన రాకపోవడం గమనార్హం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా కనిపించలేదు. గతంలో మహానాడు జరిగినప్పుడు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితరులు వచ్చి సందడి చేసిన సందర్భాలున్నాయి. ఇక ఈ సంవత్సరం తొలి రోజున వీరెవరూ కనిపించలేదు. రెండో రోజున కూడా ఎవరూ రాలేదు. ఇక బాలకృష్ణ మాత్రం తన తాజా చిత్రం షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నందున మహానాడుకు రాలేకపోయారని తెలుస్తోంది. ఏదిఏమైనా రామారావు కుటుంబానికి చెందిన వారెవరూ రాకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.

  • Loading...

More Telugu News