: ఎవరెస్ట్ పర్వతాన్ని 21 సార్లు అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీ.. ఆ ఘనత సాధించిన మూడో వ్యక్తి!


నేపాల్‌కు చెందిన 47 ఏళ్ల షెర్పా ఎవరెస్ట్ పర్వతాన్ని రికార్డు స్థాయిలో 21 సార్లు అధిరోహించి చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ ఘతన సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. శనివారం ఉదయం 8:15 గంటలకు ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న కామి రీటా షెర్పా ఈ ఘనత సాధించినట్టు షంగ్రి-ల నేపాల్ ట్రెక్ మేనేజింగ్ డైరెక్టర్ జిబాన్ ఘిమైర్ తెలిపారు. ఎవరెస్ట్‌ను ఎక్కువసార్లు అధిరోహించిన వారిలో ప్రపంచంలోనే మూడో వ్యక్తిగా రీటా నిలిచాడని నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అంగ్ షెరింగ్ షెర్పా తెలిపారు.

  • Loading...

More Telugu News