: పుట్టింది 27-5-2009, మరణం: 27-5-2017... అంటూ ట్విట్టర్ కు బై చెప్పిన రాంగోపాల్ వర్మ!


"ఇదే నా చివరి ట్వీట్. పుట్టింది: 27-5-2009, మరణం: 27-5-2017"... అంటూ నిత్యమూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో పోస్టులు పెడుతూ వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఇక మీదట ట్విట్టర్ వాడబోవడం లేదని, కేవలం ఇన్ స్టాగ్రామ్ ను మాత్రమే వాడతానని స్పష్టం చేశారు. ఇకపై తన అభిప్రాయాలను, భావాలను ఫోటోలు, వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటానని అన్నాడు. ఇంతకాలం తనను ఫాలో అవుతూ వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆపై తన ట్విట్టర్ ఖాతాను తొలగించాడు. ఇప్పుడు వర్మ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తే, 'సారీ, దట్ పేజ్ డజన్ట్ ఎగ్జిస్ట్' అన్న మెసేజ్ కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News