: నటన నా ప్రొఫెషన్...దానిని సజావుగా చేసుకోనివ్వండి: రజనీకాంత్


తమిళనాడులో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ప్ర‌వేశంపై ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విస్పష్టమైన ప్రకటన చేయని రజనీకాంత్ రేపటి నుంచి షూటింగ్ జరుపుకోనున్న 'కాలా' సినిమాలో నటించేందుకు చెన్నై నుంచి ముంబై పయనమయ్యారు. ఈ సందర్భంగా తమిళ మీడియా రజనీకాంత్ ను పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? అంటూ ప్రశ్నించింది. దానిపై మరోసారి స్పష్టత ఇవ్వని రజనీ.... "న‌ట‌న నా ప్రొఫెష‌న్, దానిని నేను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. ద‌యచేసి నా పని న‌న్ను చేసుకోనివ్వండి" అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

రజనీ వ్యాఖ్యలతో మీడియా నిరాశచెందింది. మరోవైపు రజనీ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. రజనీ పార్టీ స్థాపిస్తారా? లేక బీజేపీలో చేరుతారా? రాజకీయాల్లోకి వస్తే నటన ఆపేస్తారా? లేక నటన కొనసాగిస్తారా? అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారమవుతున్నాయి. కాగా, నేడు రజనీ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ తన సోదరుడు రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం అని, జూలైలో పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తారని తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News