: ఆ క్రైస్తవులను చంపింది మేమే: ఐఎస్ఐఎస్ ప్రకటన
సెంట్రల్ ఈజిప్టులో మోనెస్ట్రీకి బస్సులో వెళ్తున్న క్రైస్తవులపై ఆగంతుకులు జరిపిన కాల్పుల‌్లో 23 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణం తామేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అమెరికా, రష్యా దాడులతో సిరియా, ఇరాక్ లలో చేవచచ్చి, విదేశాలకు పరారైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వివిధ రూపాల్లో మారణహోమానికి కారణమవుతున్నారు. తాజాగా సెంట్రల్ ఈజిప్టులో జరిగిన ఉగ్రదాడికి తామే కారణమని, మూడు ట్రక్కుల్లో వచ్చిన సాయుధులైన తమ సైనికులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. కాగా, ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారని ఈజిప్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రతిగా లిబియాలోని డెర్నాలో జిహాదిస్టు క్యాంపులపై విమాన దాడి జరిపినట్టు ఈజిప్టు వెల్లడించింది.