: కేన్స్ లో నాకు చేదు అనుభవం ఎదురైంది: 'రౌడీ ఫెలో' హీరోయిన్ విశాఖ సింగ్


కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తనకు చేదు అనుభవం ఎదురైందని నారా రోహిత్ సరసన 'రౌడీ ఫెలో' సినిమాలో నటించిన విశాఖ సింగ్ తెలిపింది. మే 14 నుండి 26 వ‌ర‌కు జరిగిన 70వ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్సవం (కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్) కు విశాఖ సింగ్ హాజరైంది. ఓ హోట‌ల్ లో బ‌స చేసిన ఆమె ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్లి వ‌చ్చేస‌రికి విలువైన నగలు, నగదు, పాస్ పోర్ట్, ల్యాప్ టాప్ బ్యాగ్స్, గ్లాసెస్ అన్నీ దొంగిలించారు. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యంకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో తన బాధను ఇండియన్ ఎంబసీ అధికారులకు తెలిపింది. ఈ కేసును ఇండియన్ ఎంబసీ జోక్యంతో తొందరగా పరిష్కరిస్తారని భావిస్తున్నానని ట్వీట్ చేసింది.


  • Loading...

More Telugu News