: ట్రంప్ గురించి సౌదీ రాజుకే ఎక్కువ తెలిసినట్టుంది!: రాంగోపాల్ వర్మ సెటైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి అధికారిక పర్యటన సౌదీలో చేసిన సంగతి తెలిసిందే. ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించి, ఆ వెంటనే ఒక ముస్లిం దేశంలో ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతను పొందకుండా పర్యటించి ట్రంప్ రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా సౌదీఅరేబియా రాజు సల్మాన్ ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ద కాలర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ తో ట్రంప్ ను సత్కరించారు. దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించాడు. సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం ట్రంప్ కు ఇవ్వడం తనను షాక్ కు గురిచేసిందని అన్నారు. అంటే ట్రంప్ గురించి అమెరికన్లకు, ప్రపంచానికి తెలియని రహస్యం ఏదన్నా సౌదీ ప్రజలకు తెలుసా? అని ఎద్దేవా చేశాడు.
Shocked why Saudi Arabia confers its highest award on Trump ..Do the Saudis know something about him what the world and Americans don't ?
— Ram Gopal Varma (@RGVzoomin) May 23, 2017