: ఏడు గంటలపాటు మంచుకొండల్లో ట్రెక్కింగ్ చేసిన రాంచరణ్, ఉపాసన


టాలీవుడ్ ప్రముఖ యువనటుడు రాంచరణ్ తేజ్ హాలీడే ఎంజాయ్ చేస్తున్నాడు. నిర్మాతగా 'ఖైదీ నెంబర్ 150'తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రాంచరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మండుటెండల్లో గోదావరి జిల్లాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న రాంచరణ్ భార్యతో కలిసి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు లండన్ వెళ్లిపోయాడు. అక్కడ భార్యతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ యూరోప్ లోని మంచుకొండల్లో విశ్రాంతికి వెళ్లాడు. ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ ట్రెక్కింగ్ చేశారు. ఏడు గంటలపాటు కష్టపడి ఒక కొండ శిఖరం చేరుకున్నామని ఉపాసన ట్వీట్ చేసింది. ఈ ఏడు గంటల్లో చాలా క్యాలరీలు కరిగించేశామని ఉపాసన తెలిపింది. 

  • Loading...

More Telugu News