: రంజాన్ తొలి రోజునే నెత్తురోడిన ఆఫ్ఘనిస్థాన్
పవిత్ర రంజాన్ మాసంలో కూడా ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. రంజాన్ ప్రారంభమైన తొలి రోజునే ఆఫ్ఘనిస్థాన్ లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఈశాన్య రాష్ట్రమైన ఖోస్ట్ ప్రావిన్స్ లో కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా దళాలకు భద్రత కల్పిస్తున్న ఆఫ్ఘాన్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడికి బాధ్యులుగా ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు. అంతర్జాతీయంగా రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కాగా... మన దేశంలో రేపట్నుంచి మొదలు కానుంది.