: ఏ పిల్లి అయినా ఫర్వాలేదని ఆయన నిర్వచనం ఇచ్చారు: టీడీపీ అధినేత చంద్రబాబు
ఈ రోజు సిద్ధాంత పరమైన రాజకీయాల కంటే పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్టణం వేదికగా ప్రారంభమైన మహానాడులో ఆయన మాట్లాడుతూ, ‘చైనాలో ఒకప్పుడు కమ్యూనిజం ఉంది. ఆ తర్వాత షియో బెంగ్ వచ్చి ఒక మాట చెప్పారు. ‘ పిల్లి నల్లదా,తెల్లదా, ఎర్రదా అనేది ముఖ్యం కాదు. అది ఎలుకలను సమర్థవంతంగా పట్టగలిగితే, ఏ పిల్లి అయినా ఫర్వాలేదు’ అని ఒక నూతన నిర్వచనం ఇచ్చారు. 'కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన పార్టీ, ఏపీలో కాంగ్రెస్ కు మనుగడ లేదు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీని ఎవరూ గౌరవించే పరిస్థితి లేదు' అని అన్నారు.