: అమ్మవారి పాదాలకు నమస్కరించి... ఆమె నగలు ఎత్తుకుపోయారు!
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న ప్రఖ్యాత జుగల్ దేవి ఆలయంలో చోరీ జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. తొలుత వారిద్దరూ అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆమె ఆభరణాలను చోరీ చేశారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఉండటం, ఆభరణాలు మాయం కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.