: దేశంలో నంబర్ 1 స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ కూడా ఆ కంపెనీవే!
దేశంలో నంబర్ 1 స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. అలాగే అదే కంపెనీకి చెందిన శాంసంగ్ గురు 1200 నంబర్ 1 ఫీచర్ ఫోన్‌గా ఖ్యాతి దక్కించుకుంది. ఇన్‌స్టాల్‌డ్ బేస్‌లో శాంసంగ్ గెలాక్సీ జే2 ఫోన్ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచినట్టు సీఎంఆర్ నివేదిక తెలియజేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒప్పో నియో 7, షియోమీ రెడ్‌మీ నోట్ 3 ప్రొ నిలిచాయి. శాంసంగ్ గెలాక్సీ జే7ను పంజాబ్‌లో అత్యధికంగా వినియోగిస్తుండగా, ఆర్డర్లు కూడా అక్కడి నుంచే అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఇక తమిళనాడులో జీఫైవ్ బ్రాండ్‌కు చెందిన డబ్ల్యూ 1.. నంబర్ 1 ఫీచర్ ఫోన్‌గా నిలిచింది. మొబైల్ వినియోగదారులు 4-5 ఏళ్లనాటి ఫీచర్ ఫోన్లను కూడా వినియోగిస్తుండగా స్మార్ట్‌ఫోన్లను మాత్రం ఎప్పటికప్పుడు మారుస్తున్నట్టు సీఎంఆర్ నివేదిక పేర్కొంది.