: ఉగ్రవాదుల హిట్ లిస్టులో హైదరాబాద్.. అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు!


సుమారు ఇరవై మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఢిల్లీ, పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర నిఘా సంస్థ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాద్ కూడా ఉండటంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న వ్యాపార సముదాయాలు, మాల్స్ వద్ద భద్రతా లోపాలను పోలీసులు గుర్తించారు. సరైన భద్రత లేని షాపుల విషయమై వాటి యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మరోపక్క, ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి దారుణ ఘటనలకు ఉగ్రవాదులు పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, గతంలో రంజాన్ మాసంలో దాడులకు కుట్ర పన్నిన తొమ్మిది మంది ఐఎస్ ఉగ్రవాదులను హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు అరెస్టు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

  • Loading...

More Telugu News