: సెప్టెంబర్ 17న 'ఐ ఫోన్-8' విడుదల?
ఐ ఫోన్-8 విడుదల తేదీపై సామాజిక మాధ్యమాల వేదికగా ఇప్పటికే పలు వార్తలు కనిపించాయి. ఈ క్రమంలో, ఐఫోన్ల వివరాలను ఎప్పటికప్పుడు లీక్ చేసే బెంజమిన్ గెస్కిన్ అనే ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన వార్తలు కనపడుతున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన వీటిని విడుదల చేస్తారని, అలా జరగని పక్షంలో నవంబర్ 4న తప్పకుండా ఐఫోప్-8 మార్కెట్ లోకి రావచ్చని అభిప్రాయపడింది. ఐఫోన్-8కు సంబంధించిన నమూనా ఫోన్ డిజైన్ గా భావిస్తున్న పలు ఫొటోలను బెంజమిన్ గెస్కిన్ ట్విట్టర్ ఖాతాలో చేర్చారు. కాగా, ఐఫోన్-8 తో పాటు ఐఫోన్-7 ఎస్, 7ఎస్ ప్లస్ ఫోన్లను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు.