: నీకు ఎలా తెలుసు.. ఇప్పుడు నేను ఇంట్లో చేస్తోంది అదే!: వెన్నెల కిషోర్ తో సమంత
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రం బాగుందంటూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందంటూ నాగ చైతన్యకు కాబోయే భార్య, ప్రముఖ నటి సమంత ఓ ట్వీట్ లో సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పిన సమంత, నాగ చైతన్యపై ప్రేమ కురిపించింది. ఈ ట్వీట్ పై వెన్నెల కిషోర్ స్పందిస్తూ ‘థ్యాంక్యూ.. మీకు కూడా కంగ్రాట్స్’ అని తెలిపాడు. అంతేకాకుండా, డ్యాన్స్ చేస్తున్న ఒక జిఫ్ వీడియోను పోస్ట్ చేశాడు. వెన్నెల కిషోర్ ట్వీట్ కు సమంత తిరిగి రిప్లై ఇస్తూ.. ‘నీకు ఎలా తెలుసు, ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్నది అదే’ అని పేర్కొంది. ‘అదే’ అంటే, తాను కూడా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నానని సమంత చెప్పింది.