: ఆర్మీ సిబ్బందిపై కేరళ సీపీఐ(ఎం) కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు
ఆర్మీ సిబ్బంది మహిళలను ఎత్తుకెళ్లగలరని, వాళ్లని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అంటూ భారత ఆర్మీపై సీపీఐ(ఎం) కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నూర్ ప్రాంతంలో సీపీఐ(ఎం)కు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్ సదాశివం సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని ప్రయోగించారు. దీంతో, కన్నూర్ ప్రాంతంలో ఆర్మీ బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగానే బాలకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురు మనుషులు ఎక్కడైనా నిలబడి ఉంటే వారిపై కాల్పులు జరపవచ్చు, ఎప్పుడైనా, ఎక్కడైనా ఏమైనా ఆర్మీ చేయగలదంటూ వ్యాఖ్యానించారు.