: రాజీవ్ హంతకులపై 'కరుణ' చూపండి!


రాజీవ్ గాంధీ హత్యకేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేయాలని తమ అధినేత కరుణానిధి తరఫున డిఎంకె ఎంపీలు ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు డిఎంకె ఎంపీల బృందం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రత్యేకంగా కలిసింది. రాజీవ్ హత్యకేసు ముద్దాయిలు శాంతన్, పెరరివాలన్, మురుగన్ లు రెండు దశాబ్దాలకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారని ప్రధానికి తెలిపారు. మానవతా కోణంలో వారి మరణశిక్షను జీవితఖైదుకు తగ్గించాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేయాలని కోరారు. అలాగే దేశంలో మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు.

  • Loading...

More Telugu News