: ‘బాహుబలి’ సినిమా ఇంకా చూడలేదు..ఇప్పుడు చూస్తా: సల్మాన్ ఖాన్
‘బాహుబలి’ సినిమాను తాను ఇంకా చూడలేదని, ఇప్పుడు చూస్తానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. ‘బాహుబలి-1’ వచ్చినప్పుడు తాము ‘భజరంగీ భాయీజాన్’తో వచ్చామని, ‘బాహుబలి-2’ వచ్చిన తర్వాత ‘ట్యూబ్ లైట్’ చిత్రం ద్వారా వస్తున్నామని అన్నాడు. ప్రతి సినిమాకు ఓ గమ్యం ఉంటుందని, అలానే, తన ‘ట్యూబ్ లైట్’ చిత్రానికి ఎలాంటి గమ్యం నిర్దేశించబడిందో చూడాలని చెప్పాడు. అయితే, ‘బాహుబలి’ సిరీస్ ను నాలుగేళ్లపాటు తీశారని, తాను మాత్రం సంవత్సరంలో రెండు సినిమాల్లో చేశానని సల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా, ‘ట్యూబ్ లైట్’ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ నిన్న రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘బాహుబలి’ ప్రస్తావన తెచ్చాడు.