: త్వరలోనే ఉత్తర కొరియా సమస్యకు పరిష్కారం.. పందెమా?: డొనాల్డ్ ట్రంప్


ఎవరి మాటా విన‌కుండా అణ్వ‌స్త్ర ప్ర‌యోగాలు చేస్తూ ప్ర‌పంచ దేశాల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోన్న ఉత్త‌ర‌కొరియా చ‌ర్య‌ల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి స్పందిస్తూ ఆ స‌మ‌స్యకు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం దొర‌క‌నుంద‌ని చెప్పారు. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబేషింజోను కలిసిన డొనాల్డ్ ట్రంప్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... ఉత్త‌ర‌కొరియా స‌మ‌స్య చాలా పెద్ద సమస్యని అన్నారు. ఈ స‌మ‌స్య‌కు త్వరలోనే  ఎక్కడో ఒకచోట కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. కావాలంటే మీరు దీనిపై పందెం కాయొచ్చని అన్నారు.

ఇదిలా ఉంచితే, అమెరికా నుంచి ఇప్పటికే రెండు యుద్ధనౌకలు ఉత్తర కొరియా దీవుల వైపునకు కదిలాయి. మరోవైపు చైనా కూడా ఉత్తరకొరియా విషయంలో స్పందిస్తూ ఆ దేశం చేపడుతున్న ప్రయోగాలను మానుకోవాలని సూచిస్తోంది. అయినప్పటికీ ఉత్తరకొరియా రోజుల వ్యవధిలోనే అణ్వస్త్ర ప్రయోగాలు చేపడుతూ కలకలం రేపుతోంది.                  

  • Loading...

More Telugu News